విశ్వవేదికపై సింగరేణి సత్తా..

అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో ప్రథమ స్థానం.. తెలంగాణకు గర్వకారణం

హైదరాబాద్,జూన్ 7: ప్రపంచ గనుల రంగంలో సింగరేణి మరోసారి తన ప్రతిభను చాటుకుంది. జాంబియా దేశంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి రెస్క్యూ జట్టు ప్రథమ బహుమతి సాధించి విశ్వవేదికపై తెలంగాణ కీర్తిని రెపరెపలాడించింది. భూగర్భ గనుల రక్షణ విభాగంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లను వెనక్కినెట్టి విజేతగా నిలవడం విశేషం. ఈ విజయాన్ని సాధించిన సింగరేణి రెస్క్యూ జట్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం అభినందించారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో సింగరేణి సీఎండీ ఎన్‌. బలరాం (జ్యోతి బుద్ధ ప్రకాష్‌)తో కలిసి రెస్క్యూ బృందం ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా వారు గెలుచుకున్న ట్రోఫీలు, పతకాలను భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ భూగర్భ గనుల రక్షణలో సింగరేణి ఎప్పుడూ అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో చైనా, కెనడా, ఆస్ట్రేలియా, పోలాండ్, కొలంబియా వంటి గనుల రంగంలో పేరొందిన దేశాల జట్లతో పోటీపడి ప్రథమ స్థానం సాధించడం తెలంగాణతో పాటు దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. గనుల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు, విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు రెస్క్యూ సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తారని కొనియాడారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే సింగరేణి రెస్క్యూ బృందం నైపుణ్యాన్ని ఈ విజయం ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిందన్నారు. సింగరేణిని కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థగానే కాకుండా అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికలపై సింగరేణి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్‌ (పర్సనల్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌) కె. వెంకటేశ్వర్లు, జీఎం (కోఆర్డినేషన్‌ అండ్‌ మార్కెటింగ్‌) టి. శ్రీనివాస్‌, రెస్క్యూ జీఎం శ్రీనివాసరెడ్డి, రెస్క్యూ జట్టు సభ్యులు, సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలో మరో మైలురాయి గనుల భద్రత, రక్షణ కార్యకలాపాల్లో సింగరేణి జట్టు ప్రదర్శించిన ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో మరో మైలురాయిగా నిలిచింది. ప్రపంచ దేశాల మధ్య జరిగిన పోటీలో ప్రథమ స్థానం సాధించడం ద్వారా సింగరేణి సంస్థ సాంకేతిక నైపుణ్యం, శిక్షణా ప్రమాణాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
277 వీక్షణలు

ట్యాగ్‌లు

#సింగరేణి #singareni #mines #rescueteam #international

సంబంధిత వార్తలు

టెక్నాలజీ

చంద్రుడిపై మానవుడి తొలి అడుగుకు 57 ఏళ్లు

సరిగ్గా ఇదే రోజు..

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు ఊపిరి

కేంద్రమంత్రి రామ్మోహన్ను కలిసిన మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు

స్వచ్ఛాంధ్ర పనుల్లో జాప్యం వద్దన్న సీఎం చంద్రబాబు

టెక్నాలజీ

టైర్ పేలి అదుపుతప్పిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

తిరుమలలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పర్యటన

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

అణుశక్తి రంగ ప్రగతికి అద్దం మాస్కో మ్యూజియం

అణుశక్తి మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·