*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

పర్చూరు ప్రాంత రైతుల దశాబ్దాల కల అయిన గుంటూరు ఛానల్‌ పొడిగింపునకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని పూర్తిచేసి పర్చూరు రైతుల పొలాలకు నీరు అందించేందుకు ఇప్పుడు మళ్లీ కృషి చేస్తున్నదీ తెలుగుదేశం ప్రభుత్వమే. ఈ ప్రాజెక్టు కోసం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మొదటి నుంచీ ప్రత్యేకంగా శ్రమిస్తూ వస్తున్నారు. బ్రిటిష్‌ కాలం నాటి డిమాండ్‌కు 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్యరూపం లభించింది. ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యేక చొరవతో గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు రూ.274.53 కోట్లతో పరిపాలనా, సాంకేతిక అనుమతులు మంజూరయ్యాయి. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టు ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు గమనం ఒక్కసారిగా తారుమారైంది. *టీడీపీ ప్రభుత్వ అడుగు.. ప్రాజెక్టుకు ఊపిరి* 2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గుంటూరు ఛానల్‌ పొడిగింపును అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టారు. పర్చూరు, పెద్దనందిపాడు ప్రాంత రైతుల సాగునీటి అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ప్రాజెక్టుకు ఏలూరి ప్రత్యేక చొరవతో ప్రభుత్వ స్థాయిలో కదలిక వచ్చింది. 2018 లో పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. రూ.274.53 కోట్లకు సాంకేతిక అనుమతి లభించింది. హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు పనులు అప్పగించేలా కాంట్రాక్టు ప్రక్రియ కూడా పూర్తయింది. ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల అధికారులు, కాంట్రాక్టు సంస్థ కలిసి సర్వేలు నిర్వహించి ల్యాండ్‌ ప్లాన్‌ షెడ్యూళ్లను గుంటూరు, బాపట్ల కలెక్టర్లకు సమర్పించారు. ప్రాజెక్టు ఇక క్షేత్రస్థాయిలో ప్రారంభం కావడమే మిగిలింది. *ఒక్క కలంపోటుతో.. ప్రాజెక్టుకు బ్రేక్‌!* 2019లో ప్రభుత్వం మారింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిన గుంటూరు ఛానల్‌ పనులకు ఒక్క కలంపోటుతో బ్రేక్‌ పడింది. రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం, అప్పటికే ముందుకు వెళ్లిన టెండర్ల ప్రక్రియను రద్దు చేసింది. మళ్లీ టెండర్లు పిలిచే ప్రక్రియకు వెళ్లడంతో పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. ఒకవైపు ఇప్పటికే పరిపాలనా అనుమతులు, మరోవైపు సాంకేతిక అనుమతులు, కాంట్రాక్టు ప్రక్రియ పూర్తి, భూసేకరణకు ల్యాండ్‌ ప్లాన్‌ షెడ్యూళ్లు సిద్ధం — అయినప్పటికీ ప్రభుత్వం మారిన వెంటనే రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో మొత్తం ప్రక్రియను తిరగదోడింది. దీంతో పర్చూరు రైతుల దశాబ్దాల కల మళ్లీ ఫైళ్లకే పరిమితమైంది. *రివర్స్‌ టెండరింగ్‌.. రీటెండరింగ్‌.. అంతులేని జాప్యం* రివర్స్‌ టెండరింగ్‌తో మొదటి ప్రక్రియను రద్దు చేసిన తర్వాత మళ్లీ టెండర్లు పిలిచారు. ఈలోగా నిర్మాణ వ్యయాలు పెరిగాయి. అంచనా వ్యయం మారింది. పనుల పరిధిపైనా మార్పులు చోటుచేసుకున్నాయి. పర్చూరు వరకు రావాల్సిన ప్రాజెక్టును పరిమిత పరిధిలో చేపట్టే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. గర్నపూడి–అన్నంభట్లవారిపాలెం (తొండివాగు)వరకు పనులు చేపట్టే ప్రతిపాదన జరిగినా, అవసరమైన నిధులు విడుదల కాకపోవడంతో పనులు క్షేత్రస్థాయిలో ముందుకు సాగలేదు. అలా రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రారంభమైన ప్రక్రియ రీటెండరింగ్‌తో కొనసాగి, చివరకు నిధుల కొరతతో ప్రాజెక్టును మూలనపడేసింది. *ఏలూరి పోరాటం మాత్రం ఆగలేదు* ప్రాజెక్టు నిలిచిపోయినా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ గుంటూరు ఛానల్‌ పొడిగింపు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. పర్చూరు రైతుల సాగునీటి సమస్యను పదేపదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. *సీఎం చంద్రబాబుతో భేటీ.. మళ్లీ కదలిక* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి గుంటూరు ఛానల్‌ పరిస్థితిని ఎమ్మెల్యే ఏలూరి వివరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, వైసీపీ హయాంలో రివర్స్‌ టెండరింగ్‌తో జరిగిన జాప్యం, ప్రస్తుతం భూసేకరణకు ఉన్న అడ్డంకులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పర్చూరు వరకు ఛానల్‌ పనులను పూర్తి చేయాలని, భూసేకరణకు అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. *రెవెన్యూ మంత్రిని ఒప్పించి.. భూసేకరణకు అడుగు* భూసేకరణే ప్రస్తుతం ప్రధాన అడ్డంకిగా ఉండటంతో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసి పరిస్థితిని ఎమ్మెల్యే ఏలూరి వివరించారు. పర్చూరు మండలంలో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు నోటీసులు ఇవ్వాలని కోరారు. భూసేకరణకు అవసరమైన నిధులను విడుదల చేయాలని ప్రభుత్వంపై ప్రత్యేకంగా ఒత్తిడి తెచ్చారు.13-1a నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. దీంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే నీటిపారుదల మంత్రి, అధికారులతో వరుస భేటీలు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఇంజినీరింగ్‌ అధికారులతోనూ చర్చించి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసి గుంటూరు ఛానల్‌ ప్రాధాన్యాన్ని వివరించి సహకారం కోరారు. *51 ఎకరాలకు భూసేకరణకు.. ఏలూరి పట్టుదల* పర్చూరు మండలంలో అవసరమైన 51 ఎకరాల కు భూసేకరణ చేపట్టాలని ఎమ్మెల్యే ఏలూరి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బాపట్ల ఆర్డీఓ ఖాతాలో నిధులు జమ చేసి భూసేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని పట్టుబడుతున్నారు. నిధులు విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిలిచిపోయిన నోటిఫికేషన్‌ ప్రక్రియను పునఃప్రారంభించి భూముల సేకరణకు ముందడుగు పడింది. *తొండివాగు నుంచి... పర్చూరు వాగుకు ఫేజ్...2* ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం గుంటూరు ఛానల్ పనులను నిశితంగా పరిశీలించి.. పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా పెద్దనందిపాడు నుంచి తొండివాగు వరకు మొదటి దశ లో చెప్పటేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొండివాగు నుంచి...పర్చూరు వాగు వరకు ఫేజ్...2లో మిగిలిన భూ సేకరణ చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. *48 గ్రామాల రూపురేఖలు మారే ప్రాజెక్టు* గుంటూరు ఛానల్‌ పర్చూరు వరకు పొడిగిస్తే సుమారు 48 గ్రామాల రూపురేఖలు మారే అవకాశం ఉంది. సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందే అవకాశం ఉంటుంది. పర్చూరు ప్రాంత వ్యవసాయానికి శాశ్వత సాగునీటి వనరు ఏర్పడటంతో రైతుల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. *పట్టిసీమ జలాలు పర్చూరుకు వచ్చే అవకాశం* గుంటూరు ఛానల్‌ పొడిగింపు పూర్తయితే భవిష్యత్‌లో పట్టిసీమ ద్వారా వచ్చే గోదావరి జలాలను పర్చూరు ప్రాంతానికి తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఇది కేవలం ఒక కాలువ పొడిగింపు ప్రాజెక్టు కాదని, పర్చూరు ప్రాంత భవిష్యత్తును మార్చే సాగునీటి ప్రాజెక్టు అని ఏలూరి చెబుతున్నారు. *శ్రీకారం టీడీపీదే.. అడ్డుకున్నది వైసీపీ.. పూర్తి చేయించేది మళ్లీ టీడీపీనే!* గుంటూరు ఛానల్‌ పొడిగింపు చరిత్రలో మూడు స్పష్టంగా దశలు. మొదటి దశ – టీడీపీ: దశాబ్దాల డిమాండ్‌కు పరిష్కారం చూపుతూ 2019లో రూ.274.53 కోట్లతో పరిపాలనా, సాంకేతిక అనుమతులు తీసుకువచ్చింది. కాంట్రాక్టు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది. రెండో దశ – వైసీపీ: 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో గత ప్రభుత్వంలో ముందుకు వెళ్లిన పనులకు బ్రేక్‌ వేసింది. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో టెండర్లను రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలవడంతో ప్రాజెక్టు సంవత్సరాల పాటు వెనక్కి వెళ్లింది. అంచనాల పెరుగుదల, పనుల పరిధిలో మార్పులు, నిధుల విడుదలలో జాప్యంతో చివరకు ప్రాజెక్టు మూలనపడింది. మూడో దశ – కూటమి ప్రభుత్వం: అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రాజెక్టును మళ్లీ తన భుజాన వేసుకున్నారు. సీఎం చంద్రబాబు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, నీటిపారుదల మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఇంజినీరింగ్‌ అధికారులను కలిసి భూసేకరణ, నిధుల విడుదల, పనుల పునఃప్రారంభానికి చర్యలు తీసుకునేలా కృషి చేస్తున్నారు. టీడీపీ హయాంలో పుట్టిన ప్రాజెక్టు.. వైసీపీ హయాంలో ఆగిపోయిన ప్రాజెక్టు.. ఇప్పుడు టీడీపీ హయాంలోనే మళ్లీ పట్టాలెక్కుతున్న ప్రాజెక్టు. పర్చూరు రైతుల దశాబ్దాల కలను సాకారం చేసేందుకు ఎమ్మెల్యే ఏలూరి చేస్తున్న ప్రత్యేక ప్రయత్నాలకు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది.
553 వీక్షణలు

ట్యాగ్‌లు

#guntur #channel #mla #yeluri

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

దళవాయి రమాదేవికి అభినందనలు తెలిపిన మంత్రి

నారా లోకేష్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రైతుల అవసరాలే లక్ష్యంగా ఉద్యాన పరిశోధనలు

మంత్రి తుమ్మల

రాజకీయాలు

కార్యకర్త నుంచి జాతీయ నాయకత్వం దాకా...

విష్ణువర్ధన్ రెడ్డి స్ఫూర్తిదాయక ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదు

మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*వైద్య సాయమే ప్రాణదానం*

ఎమ్మెల్యే ఏలూరి చొరవతో పేద కుటుంబానికి భరోసా

రచయిత Venkat Kommineni ·