*వైద్య సాయమే ప్రాణదానం*
ఎమ్మెల్యే ఏలూరి చొరవతో పేద కుటుంబానికి భరోసా
యద్దనపూడి మండలం చింతపల్లిపాడుకు చెందిన హైమాల పెద్ద దానయ్య నిరుపేద కుటుంబీకుడు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఆయనకు తీవ్ర కామెర్ల వ్యాధి, లివర్ సంబంధిత సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే నరసరావుపేటలోని వెంకటేశ్వర నర్సింగ్‌హోంకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని, తక్షణమే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు స్పష్టం చేశారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి ఆపరేషన్ ఖర్చు తలకుమించిన భారంగా మారింది. ప్రాణం మీదకు వచ్చిన తమవారిని ఎలా కాపాడుకోవాలో తెలియక కన్నీటి పర్యంతమయ్యారు. ఈ క్లిష్ట సమయంలో వారికి గుర్తొచ్చింది స్థానిక ఎమ్మెల్యే ఏలూరి. ఆయన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకోగా, బాధిత కుటుంబం పడుతున్న వేదనను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. ఎల్‌వోసీ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.1,02,714 మంజూరు చేయించి, చెక్కును స్వయంగా అందజేశారు.
ఆ చెక్కు ఆ కుటుంబానికి ప్రాణదానంలా మారింది. సకాలంలో అందిన ఈ సాయంతో దానయ్యకు నిరాటంకంగా శస్త్రచికిత్స చేయించుకునే వెసులుబాటు లభించింది. తమను ఆదుకున్న ఎమ్మెల్యేను తలచుకుంటూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.స్థానిక నేతలు ఆ చెక్కును అందజేశారు.