ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణకు

సీఎం చంద్రబాబు పిలుపు

అమరావతి, జూన్ 28: జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాంప్ కార్యాలయంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా పిల్లలను ఎత్తుకుని ముద్దుచేస్తూ, వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, పిల్లల ఆరోగ్యం, వ్యాక్సినేషన్ వివరాలను ఆరా తీశారు. నిర్ణీత సమయానికి అన్ని టీకాలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో పల్స్ పోలియో అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. మూడు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో 5 ఏళ్లలోపు పిల్లలు సుమారు 49.20 లక్షల మందికి పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. పిల్లల పెంపకంలో తండ్రి బాధ్యత వహించాలి: సీఎం ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు. ఉద్యోగాలు, ఉపాధికి వెళుతున్న మహిళలు పిల్లల పెంపకాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. పిల్లల్ని కనడం, పెంచడం వంటి బాధ్యతలు తల్లికే పరిమితం చేయరాదని, ఇంట్లో భర్తలు, పురుషులు కూడా ఆ బాధ్యతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పిల్లల పెంపకంలో ఇంటిల్లిపాదీ భాగస్వాములయ్యేవారని, పిల్లలకు విలువలు నేర్పడంలో అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర పెద్దలు కీలక పాత్ర పోషించేవారని చంద్రబాబు గుర్తుచేశారు. అలాంటి బలమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ తిరిగి రావాలని ఆకాంక్షించారు. సంతానం భారం కాదు, సంపద: సీఎం పిల్లలను భారంగా, సమస్యగా చూసే ధృక్పథం మారాలని, సంతానమే సంపద అనే అవగాహన సమాజంలో పెరుగుతోందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. ఇందుకోసం ముందుగా తల్లిదండ్రులకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
222 వీక్షణలు

ట్యాగ్‌లు

#cm #chandrababu #polio #drops

సంబంధిత వార్తలు

ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*వైద్య సాయమే ప్రాణదానం*

ఎమ్మెల్యే ఏలూరి చొరవతో పేద కుటుంబానికి భరోసా

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

పర్యావరణ హితం.. కలెక్టర్ వినూత్న ప్రయత్నం

ఎలక్ట్రిక్ స్కూటీకి జిల్లా కలెక్టర్ పూజలు

రచయిత Sriram ·
ఆరోగ్యం

సంజీవనిలో డేటా ఇంటిగ్రేషన్‌ కీలకం

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం

'ఈగల్' పోరాటం

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·