మెట్రో రెండో దశ నిధులపై కేంద్రం దృష్టికి సీఎం రేవంత్

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ

న్యూఢిల్లీ,జూన్‌ 23: హైదరాబాద్‌ మెట్రో రెండో దశ నిర్మాణం, నిధుల సమీకరణ అంశాలపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. సోమవారం రాత్రి ఢిల్లీలోని రైల్వే భవన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. ఈ భేటీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. మెట్రో ఫేజ్‌-2 నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఇందుకు అవసరమైన నిధుల సమీకరణపై ఈ సందర్భంగా చర్చించారు. భారతీయ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్‌ రుణం విడుదలలో జాప్యంపై సీఎం ఇంతకుముందే అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. నిబంధనల ప్రకారం రూ.84.32 కోట్ల అడ్వాన్స్‌ ఫీజు చెల్లించినా తొలి విడత రుణం విడుదల కాలేదని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మీడియాతో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ, రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా సాగాయని తెలిపారు. మెట్రో ఫేజ్‌-2 నిధుల విడుదలపై మంగళవారం ఉదయం కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను కూడా కలవనున్నట్లు వెల్లడించారు. ఇదే పర్యటనలో సీఎం, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి ఆదిలాబాద్‌ విమానాశ్రయాన్ని సమగ్ర సదుపాయాలతో అభివృద్ధి చేయాలని కోరారు. హైదరాబాద్‌లో ఎస్‌బీఐ భూ వివాదం, మెట్రో రుణ సమస్యలపై పరిష్కారం కోసం ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
218 వీక్షణలు

ట్యాగ్‌లు

#cmrevanth #centralministers #kishanreddy

సంబంధిత వార్తలు

సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
సినిమాలు

రంగస్థలం నుంచి వెండితెర వరకు విశిష్ట సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి

భరణి

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

గాన కోకిల" మూగబోయింది

జానకమ్మ అస్తమయం

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

సంగీత సరస్వతి బాలమురళి నేడు జయంతి

ఘనంగా నివాళులు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

వెండితెర సుందరి నుంచి వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌గా"సదా"అరుదైన ప్రస్థానం

పులుల ప్రేమలో పడి కెమెరా పట్టిన 'జయం' కథానాయిక

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

ముక్కావారిపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి

రామ్‌జీ జాబ్‌కార్డుల పంపిణీ

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·