తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత

చెన్నై,జూన్ 10:తమిళ సినీ పరిశ్రమలో గ్రామీణ కథలకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన ప్రముఖ దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీరాజా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఓ విశిష్ట దర్శకుడిని కోల్పోయింది. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారతీరాజా.. 1977లో విడుదలైన‘16 వయతినిలే’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి సంచలనం సృష్టించారు. అప్పటివరకు స్టూడియోలకు పరిమితమైన తమిళ సినిమాను పల్లెల బాట పట్టించి,గ్రామీణ జీవన విధానాన్ని సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక శైలి కారణంగానే అభిమానులు ఆయననుదర్శక ఇమయం’గా గౌరవించారు. ‘సిగప్పు రోజక్కల్’, ‘కిజక్కే పోగుం రైల్’, ‘అలైగల్ ఓయ్వతిల్లై’, ‘ముదల్ మరియాదై’, ‘కరుత్తమ్మ’ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాలు రూపొందించి తన ప్రతిభను చాటుకున్నారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకోగా, ఆయనకు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును తెచ్చిపెట్టింది. అలాగే ‘మంగమ్మగారి మనవడు’ చిత్రానికి కథను, ‘పల్నాటి పౌరుషం’ చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తన చిత్రాల ద్వారా రాధా, రాధికా, రేవతి, కార్తీక్ తదితర పలువురు నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత కూడా భారతీరాజాదే. దర్శకుడిగానే కాకుండా ‘ఆయుధ ఎళుత్తు’,‘పాండియా నాడు’‘తిరుచిత్రంబలం’ తదితర చిత్రాల్లో నటుడిగానూ తనదైన ముద్ర వేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో సేవలందించిన భారతీరాజా ఆరు జాతీయ పురస్కారాలు,నాలుగు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులతో పాటు పలు రాష్ట్ర స్థాయి పురస్కారాలను అందుకున్నారు. భారతీయ సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2004లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. గ్రామీణ జీవిత సౌందర్యాన్ని, మానవ సంబంధాల సున్నితత్వాన్ని తన చిత్రాల ద్వారా చిరస్థాయిగా నిలిపిన భారతీరాజా మరణం సినీ రంగానికి తీరని లోటుగా పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకుల్లో ఆయన ఒకరిగా గుర్తుండిపోతారు.
251 వీక్షణలు

ట్యాగ్‌లు

#tamilactor #bharathi #raja #tamildirector #breaking #diedtamilactor

సంబంధిత వార్తలు

సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
సినిమాలు

రంగస్థలం నుంచి వెండితెర వరకు విశిష్ట సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి

భరణి

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

గాన కోకిల" మూగబోయింది

జానకమ్మ అస్తమయం

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

సంగీత సరస్వతి బాలమురళి నేడు జయంతి

ఘనంగా నివాళులు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

వెండితెర సుందరి నుంచి వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌గా"సదా"అరుదైన ప్రస్థానం

పులుల ప్రేమలో పడి కెమెరా పట్టిన 'జయం' కథానాయిక

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

ముక్కావారిపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి

రామ్‌జీ జాబ్‌కార్డుల పంపిణీ

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·