రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:

మంత్రి తుమ్మల

వరంగల్, జూన్ 2: రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ (ఎనుమాముల) వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎర్ర ప్రియాంక, వైస్ చైర్‌పర్సన్‌గా బండి జనార్ధన్ నియమితులయ్యారని మంత్రి తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, నిల్వ, విక్రయ ప్రక్రియల్లో పారదర్శకత పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 191 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించినట్లు మంత్రి వెల్లడించారు. మార్కెట్ కమిటీల ఏర్పాటులో జాప్యం లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ మార్కెట్లలో వరంగల్ (ఎనుమాముల) మార్కెట్ కమిటీ ఒకటని మంత్రి తెలిపారు. కొత్త పాలకవర్గం స్థానిక రైతుల సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించడంతో పాటు మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తూకం, నిల్వ, వేలం ప్రక్రియల్లో పారదర్శకత తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.వ్యవసాయ ఉత్పత్తులకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు మార్కెట్ యార్డుల్లో ఆధునిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు ప్రయోజనాల పరిరక్షణ, వ్యవసాయ రంగ అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే ప్రభుత్వ విధానమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.నూతనంగా నియమితులైన చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంక, వైస్ చైర్‌పర్సన్ బండి జనార్ధన్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు మంత్రి అభినందనలు తెలియజేస్తూ, రైతులకు అంకితభావంతో సేవలు అందించాలని ఆకాంక్షించారు. రైతు సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.
220 వీక్షణలు

ట్యాగ్‌లు

#ministerthummala #warangalmarketcommittee #telangana #agriminister #newmarketcommittee

సంబంధిత వార్తలు

సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
సినిమాలు

రంగస్థలం నుంచి వెండితెర వరకు విశిష్ట సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి

భరణి

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

గాన కోకిల" మూగబోయింది

జానకమ్మ అస్తమయం

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

సంగీత సరస్వతి బాలమురళి నేడు జయంతి

ఘనంగా నివాళులు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

వెండితెర సుందరి నుంచి వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌గా"సదా"అరుదైన ప్రస్థానం

పులుల ప్రేమలో పడి కెమెరా పట్టిన 'జయం' కథానాయిక

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

ముక్కావారిపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి

రామ్‌జీ జాబ్‌కార్డుల పంపిణీ

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·