ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై సమన్వయంతో పనిచేయాలి

టీడీపీ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు.తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ,ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో బూత్ ఏజెంట్లు, యూనిట్ ఇన్‌చార్జులు,క్లస్టర్ ఇన్‌చార్జులు,మండల అధ్యక్షులు,నియోజకవర్గ కమిటీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు సమిష్టిగా పనిచేయాలన్నారు.అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో నమోదు చేయడంతో పాటు, లోపాలను గుర్తించి సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కుల్లో ఓటు హక్కు ఒకటని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడాన్ని కర్తవ్యంగా భావించాలని, యువత ప్రత్యేకంగా ఓటరు నమోదుపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లు పూర్తిచేసుకున్న ప్రతి యువకుడు, యువతి తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్న ఆయన, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహనతో వ్యవహరించాలని కోరారు. పార్టీ శ్రేణులు ప్రతి బూత్‌పై ప్రత్యేక దృష్టి సారించి ఓటరు నమోదులు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని సూచించారు.ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతం కావాలంటే అన్ని స్థాయిల నాయకత్వం పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఏలూరి స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యేలు ,ఎంపీలు , పరిసలకు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
269 వీక్షణలు

ట్యాగ్‌లు

#tdpmla #tdpoffice #centraloffice #trainingprogram #mlayeluri #lokesh #cmbabu

సంబంధిత వార్తలు

సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
సినిమాలు

రంగస్థలం నుంచి వెండితెర వరకు విశిష్ట సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి

భరణి

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

గాన కోకిల" మూగబోయింది

జానకమ్మ అస్తమయం

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

సంగీత సరస్వతి బాలమురళి నేడు జయంతి

ఘనంగా నివాళులు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

వెండితెర సుందరి నుంచి వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌గా"సదా"అరుదైన ప్రస్థానం

పులుల ప్రేమలో పడి కెమెరా పట్టిన 'జయం' కథానాయిక

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

ముక్కావారిపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి

రామ్‌జీ జాబ్‌కార్డుల పంపిణీ

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·