విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి సతీమణి భువనేశ్వరి, మనుమడు దేవాన్ష్‌తో కలిసి విఘ్నేశ్వరుడికి సీఎం చంద్రబాబు పూజలు వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి ఆంధ్రప్రదేశ్‌ సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా తన సతీమణి నారా భువనేశ్వరి, మనుమడు దేవాన్ష్‌తో కలిసి తన నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడిని పూజించి రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రార్థించారు. జ్ఞానం.. వివేకం.. విజయానికి ప్రతీక కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన గణనాథుడి పూజ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. గణపతి జ్ఞానం, వివేకం, విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయమన్నారు. విఘ్నాలను తొలగించి సన్మార్గాన్ని చూపే గణనాథుడి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఐక్యతను చాటే వేడుకలు వినాయక చవితి వేడుకలు ప్రజల్లో సామాజిక స్పృహ, ఐక్యత, సమష్టితత్వాన్ని పెంపొందిస్తాయని చంద్రబాబు అన్నారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో ధార్మిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి నిర్వహించే వినాయక చవితి వేడుకలు ప్రజల మధ్య సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థన వినాయక చవితి వేడుకలు మన సంస్కృతి, సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకలని సీఎం తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి ఆంధ్రప్రదేశ్‌ సుభిక్షంగా ఉండాలని, తెలుగు జాతి వర్ధిల్లాలని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
96 వీక్షణలు

ట్యాగ్‌లు

#ganesh #vinayaka

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·