సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష
హాజరైన ఇలంబరిది
1 / 2
హైదరాబాద్ సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చిస్తున్నారు. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) నిర్వహణ ఏర్పాట్లు, సంబంధిత అంశాలపై కూడా సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి ఇలాంబర్తి, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్, NHAI ప్రాంతీయ అధికారి శివశంకర్, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్లు లింగారెడ్డి, బి.వి.రావు, వసంత్ నాయక్, ధర్మారెడ్డి, నర్సింగ్‌రావు, రాజేందర్, రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.