ఖమ్మంలో వెలిసిన 'తిరుమల

"తుమ్మల" పట్టుదలే పునాది

•శ్రీవారి ఆలయానికి భూమిపూజ.. •రూ.1.46 కోట్ల విరాళాల వెల్లువ •ఆశ్వయుజ సోమవారం..చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన ఖమ్మం,అక్టోబరు 12: ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణం "ఇది దైవ సంకల్పం" అన్నారు చిన్నజీయర్ స్వామి. ఏడుకొండలవాడు శ్రీనివాసుడు భూమిపై అడుగుపెట్టిన ఆశ్వయుజ మాసపు సోమవారం నాడే, ఖమ్మం గడ్డపై ఆయన ఆలయానికి శంకుస్థాపన జరగడం విశేషం. వేదమంత్రాల నడుమ, హోమం అనంతరం టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి భూమిపూజ చేశారు. స్వామివారు ఈ నగరాన్ని పవిత్రం చేసేందుకు స్వయంగా వస్తున్నారని స్వామీజీ ఆశీర్వదించారు. అల్లీపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బి.ఆర్‌.నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర టి.ఎస్‌., సీపీ సునీల్‌దత్ పాల్గొన్నారు. శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. *తుమ్మల రూపంలో విక్రమార్కుడు* ఈ ఆలయం ఇక్కడ రూపుదిద్దుకోవడానికి మంత్రి తుమ్మల కృషే ప్రధాన కారణమని బి.ఆర్‌.నాయుడు కొనియాడారు. "చిన్నతనంలో విక్రమార్కుడి గురించి చదువుకున్నాం. ఇప్పుడు తుమ్మల రూపంలో అలాంటి వ్యక్తిత్వాన్ని చూస్తున్నాం" అన్నారు. తెలంగాణలో సీఎం నియోజకవర్గమైన కొడంగల్ తర్వాత ఆలయానికి అనుమతి లభించింది ఖమ్మంకేనని, కరీంనగర్‌లోనూ త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయ నిర్మాణాలు చేపడుతోందని, వచ్చే ఏడాదిలో ఐదువేల ఆలయాలు నిర్మించాలన్నది లక్ష్యమని చెప్పారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో పనులు సాగుతున్నాయన్నారు. అలిపిరి వద్ద రూ.2,700 కోట్లతో నిర్మించే సమగ్ర టౌన్‌షిప్‌లో రద్దీ సమయంలో సుమారు 20 వేల మందికి వసతి కల్పిస్తామని వివరించారు. స్థానిక ఆలయ నిర్మాణానికి 25 శాతం నిధులను స్థానిక భక్తులు సమకూర్చాలన్నది టీటీడీ నిబంధన అని గుర్తుచేశారు. సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. *'పూర్వజన్మ సుకృతం'* భూమిపూజలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని తుమ్మల పేర్కొన్నారు. శ్రీరాముడి ఆశీస్సులతో భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించామని, అవి వేగంగా సాగుతున్నాయని చెప్పారు. శ్రీవారి ఆలయం పూర్తయితే ఖమ్మం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్నజీయర్ స్వామికి, అనుమతి మంజూరు చేసిన నాయుడుకు, టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. *కులాలకు అతీతంగా..* ధర్మమార్గంలో "కులాల ఆధారంగా విడిపోకుండా మనమందరం ఒకే భగవంతుని సంతానమని గుర్తించాలి. మనందరికీ ఉమ్మడి గుర్తింపుగా వేంకటేశ్వరస్వామి ఉండాలి" అని చిన్నజీయర్ స్వామి ఆకాంక్షించారు. శ్రీరాముడు బోయవాడిని, శబరిని, జటాయువును, విభీషణుడిని అక్కున చేర్చుకున్న తీరును ప్రస్తావిస్తూ, భగవంతుని దృష్టిలో భక్తి, మంచి మనసు, ధర్మబద్ధ జీవనమే ప్రధానమని చెప్పారు. ఆలయాలు పూజలకే పరిమితం కాకుండా మానవత్వం, పరస్పర సహకారం, సమాజ శ్రేయస్సును పెంపొందించే కేంద్రాలుగా నిలవాలన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు నాయుడు టెలివిజన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసించారు. "ప్రతి భక్తుడు ఒక్క ఇటుక అందించినా ఆలయ నిర్మాణంలో భాగస్వామి అయినట్లే" అని పిలుపునిచ్చారు. *ముందుకొచ్చిన దాతలు* సభా వేదికపైనే విరాళాలు వెల్లువెత్తాయి. ఎంపీ బండి పార్థసారథిరెడ్డి రూ.60 లక్షలు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రూ.50 లక్షలు, ఎమ్మెల్సీ తాతా మధు రూ.25 లక్షలు ప్రకటించారు. భోజన ఏర్పాట్లు చేసిన దాత మరో రూ.11 లక్షలు ఇచ్చారు. వివరాలను మంత్రి తుమ్మల వెల్లడించారు. టీటీడీ నమూనాలో ఆలయం నిర్మితం కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని జేఈవో ఎ.శరత్ అన్నారు. భక్తుల సహకారంతో నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి దయానంద్, నగరపాలక కమిషనర్ అభిషేక్ అగస్త్య, సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ హన్మంతరావు, రాయల నాగేశ్వరరావు, తుమ్మల యుగంధర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
101 వీక్షణలు

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

యూకే సంస్థలతో తెలంగాణకు రెండు ఒప్పందాలు

మంత్రి తుమ్మల వెల్లడి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఎమ్మెల్యే ఏలూరిపై హోంమంత్రి అనిత ప్రశంసల జల్లు

ప్రజానేత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*ఉద్యాన హబ్‌లో పర్చూరుకు స్థానం*

సాంబన్న కృషి

రచయిత Sriram ·
రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·