మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం.. జగన్‌ కేబినెట్‌లో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని (57) కన్నుమూశారు. విశాఖపట్నంలో మంగళవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌. 1969 డిసెంబర్‌ 30న జన్మించిన ఆళ్ల నాని ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఆళ్ల నాని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆళ్ల నాని మృతికి పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.
98 వీక్షణలు

ట్యాగ్‌లు

#allanani #exminister

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·