యూకే సంస్థలతో తెలంగాణకు రెండు ఒప్పందాలు

మంత్రి తుమ్మల వెల్లడి

హైదరాబాద్‌, అక్టోబరు 14: తెలంగాణలో టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ రంగం అభివృద్ధికి యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ హడర్స్‌ఫీల్డ్‌, టెక్స్‌టైల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటితో పరిశోధన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హడర్స్‌ఫీల్డ్‌ విశ్వవిద్యాలయంతో ఒప్పందం ద్వారా ఉమ్మడి విద్యా కార్యక్రమాలు, అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడి, పరిశోధన, అభివృద్ధికి సహకారం అందించనున్నారు. టెక్స్‌టైల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌తో ఒప్పందం ద్వారా వృత్తి విద్య, శిక్షణ, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల కల్పనపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా 3డీ వీవింగ్‌, కాంపోజిట్‌ మెటీరియల్స్‌ తయారీ, పరిశోధనలో సహకారం అందించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడంతో పాటు, జౌళి రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ భాగస్వామ్యాలు దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, జౌళిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్‌, యార్క్‌షైర్‌ మేయర్‌ వ్యాపార సలహాదారు మాండీ రిడ్‌యార్డ్‌, డేవిడ్‌ యాంటిచ్‌, ప్రొఫెసర్‌ గోస్వామి, టెక్స్‌టైల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఎండీ అజీజ్‌, అధికారులు పాల్గొన్నారు.
63 వీక్షణలు

ట్యాగ్‌లు

#textiles #uk #tummala

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

ఖమ్మంలో వెలిసిన 'తిరుమల

"తుమ్మల" పట్టుదలే పునాది

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఎమ్మెల్యే ఏలూరిపై హోంమంత్రి అనిత ప్రశంసల జల్లు

ప్రజానేత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*ఉద్యాన హబ్‌లో పర్చూరుకు స్థానం*

సాంబన్న కృషి

రచయిత Sriram ·
రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·