స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు శాశ్వత అండ

మంత్రి లోకేష్

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు శాశ్వతంగా అండగా నిలుస్తామని, కేవలం పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోబోమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మృతుల కుటుంబాల్లో పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగి అనే తేడా లేకుండా ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌.డి. కుమారస్వామి హామీ ఇచ్చినట్లు తెలిపారు. తొలి విడతగా మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. అనంతరం స్టీల్ ప్లాంట్ నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా, పీఎఫ్‌, ఇతర బకాయిలను లెక్కించి బాధిత కుటుంబాల ఖాతాల్లో జమ చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును కాపాడేందుకు కేంద్రం రూ.15 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించి ఉత్పత్తి పునరుద్ధరించిన సమయంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. ప్రమాదంపై ఇప్పటికే విచారణ కమిటీని నియమించామని, కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల కొరత లేదా ఉత్పత్తి ప్రక్రియలో లోపాల వల్ల ప్రమాదం జరగలేదని లోకేష్ స్పష్టం చేశారు. ఉక్కు ద్రవం లాడిల్ నుంచి ఒక్కసారిగా పైకి ఎగసి పడటంతో ఘటన జరిగిందని, ఇందుకు గల కారణాలపై నిపుణులు పరిశీలిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. విశాఖ ఉక్కు దీర్ఘకాలిక అభివృద్ధికి స్లర్రీ పైప్‌లైన్ అవసరమని, దానిని తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కాపాడిన ఎన్డీయే ప్రభుత్వం, ఇప్పుడు కార్మికుల కుటుంబాలకు కూడా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు కేజీహెచ్‌, సెవెన్ హిల్స్‌, కిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించి, ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ శ్రీ భరత్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
243 వీక్షణలు

ట్యాగ్‌లు

#nara #lokesh #vizag #steel #plant #home #minister

సంబంధిత వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

దళవాయి రమాదేవికి అభినందనలు తెలిపిన మంత్రి

నారా లోకేష్

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·