రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

ఖమ్మం, జూలై 26: రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. మండలంలోని ఏ ఒక్క గ్రామంలోనైనా రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందని నిరూపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయన సవాలు చేశారు. గతంలో రుణమాఫీపై ప్రశ్నించినప్పుడల్లా సమాధానం దాటవేసి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారే తప్ప, హామీల అమలుపై స్పష్టత ఇవ్వడం లేదని పువ్వాడ మండిపడ్డారు. పాలకుడి మనసు మంచిగా ఉంటేనే ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని, అందుకు కేసీఆర్ పాలనే నిదర్శనమని పేర్కొన్నారు. ఆ హయాంలో రైతుబంధు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువుల సరఫరా వంటి పథకాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలు సమీపించినప్పుడు మాత్రమే రైతుబంధు నిధులను అరకొరగా జమ చేస్తోందని, గతంలో సులభంగా అందిన యూరియాను ఇప్పుడు యాప్‌ల పేరుతో దూరం చేసి, ఎరువుల కోసం రైతులు క్యూల్లో నిలబడాల్సిన దుస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. విద్యుత్ కోతలు మళ్లీ పెరిగాయని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, మోటార్లు దెబ్బతినడం వంటి సమస్యలతో రైతులు అల్లాడుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన పంట బోనస్ హామీ కూడా నీరుగారిపోయిందని విమర్శించారు. "మోసపోతే గోస పడతాం" అని కేసీఆర్ గతంలో అన్న మాటలు నిజమవుతున్నాయని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇప్పుడు అదే అనుభవిస్తున్నారని పువ్వాడ అన్నారు. గత రెండు నెలలుగా వర్షాభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
161 వీక్షణలు

ట్యాగ్‌లు

#puvvada #runamafi #brs

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·