పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

• రాష్ట్రవ్యాప్తంగా 950 చిత్తడి నేలల గుర్తింపు.. తొలి దశలో 16 నోటిఫికేషన్‌కు సిద్ధం • అనకాపల్లి జిల్లా కొండకర్ల ఆవను కన్జర్వేషన్‌ రిజర్వ్‌గా ప్రకటనకు కసరత్తు • ఎన్‌వోసీ జారీకి ప్రభుత్వం అనుమతి.. జలవనరుల శాఖ ఆమోదం • ప్రజా ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశం • ఎకో టూరిజం అభివృద్ధి అవకాశాలపై అధ్యయనం చేయాలని సూచన అమరావతి, జూలై 26: రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కళ్యాణ్‌ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణను బాధ్యతగా స్వీకరించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ జీవవైవిధ్య కేంద్రమైన కొండకర్ల ఆవను ‘పరిరక్షణ నిల్వ’ (కన్జర్వేషన్‌ రిజర్వ్‌)గా గుర్తించే ప్రక్రియలో ప్రభుత్వం ముందడుగు వేసింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం కొండకర్ల ఆవ చిత్తడి నేలను కన్జర్వేషన్‌ రిజర్వ్‌గా ప్రకటించేందుకు అవసరమైన నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ) జారీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అటవీశాఖ ప్రతిపాదనలకు జలవనరుల శాఖ కూడా ఆమోదం తెలిపింది. సాగునీరు, జలాశయ నిర్వహణ, హైడ్రాలిక్‌ వ్యవస్థలు సహా ఇతర ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు ఎలాంటి భంగం కలగకుండా తగిన రక్షణ చర్యలతో ఈ అనుమతి మంజూరైందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. శాస్త్రీయ అధ్యయనాలు, క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా రాష్ట్రంలో 950 చిత్తడి నేలలను గుర్తించినట్టు వెల్లడించారు. వీటిని దశలవారీగా నోటిఫై చేయాల్సి ఉందని, తొలి దశలో 16 చిత్తడి నేలల నోటిఫికేషన్‌ ప్రక్రియ తుది దశలో ఉందని పేర్కొన్నారు. చిత్తడి నేలలు అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయాలని, వాటి పరిరక్షణ ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, జల భద్రత, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యమవుతుందని చెప్పారు. అలాగే స్థానిక ప్రజల జీవనోపాధుల మెరుగుదలకు కూడా ఇవి దోహదపడతాయని తెలిపారు. అర్హత కలిగిన అన్ని చిత్తడి నేలలను నోటిఫై చేసే ప్రక్రియను సంబంధిత శాఖల సమన్వయంతో వేగవంతం చేయాలని, సంయుక్త సర్వేలు పూర్తి చేసి నిర్దిష్ట కాలవ్యవధిలో చట్టపరమైన అనుమతులు పొందాలని అధికారులను ఆదేశించారు. చిత్తడి నేలలపై జరుగుతున్న ఆక్రమణలు, విధ్వంసక చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో చిత్తడి నేలల పరిరక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. అనేక రకాల వలస, స్థానిక పక్షులకు ఆవాసంగా నిలుస్తున్న కొండకర్ల ఆవలో జలవనరుల శాఖ సమన్వయంతో ఎకో-టూరిజం అభివృద్ధికి గల అవకాశాలను అధ్యయనం చేసి, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని అటవీశాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
216 వీక్షణలు

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·