టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

విజయనగరం జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు విజయనగరం: విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా జడ్పీ ఛైర్మన్‌, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావును చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మజ్జి శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర కూడా టీడీపీలో చేరారు. ఆమెకు సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. విజయనగరం జిల్లాలో వైసీపీకి ముఖ్య నేతగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరడంతో జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్‌, మాజీ మంత్రులు కళావెంకట్రావు, కోండ్రు మురళీ, సుజయ్‌ కృష్ణ రంగారావు, ఎంపీ అప్పలనాయుడు, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
138 వీక్షణలు

ట్యాగ్‌లు

#vijayanagaram #maji #srinivas

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·