నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్

హాల్‌టికెట్ చూపిస్తే చాలు...ఉచిత ప్రయాణం

హైదరాబాద్,జూన్ 19: నీట్ (NEET) రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) తీపి కబురు అందించింది. ఈ నెల 21న నిర్వహించే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ను చూపించి పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు, తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏసీ బస్సులు మినహా ఆర్టీసీ నిర్వహించే అన్ని సర్వీసుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 73 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల మార్గాల్లో అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సౌకర్యం 21వ తేదీ తొలి సర్వీసు నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని, ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే 040-23450033, 68153333 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 🔹 ఎప్పుడు? – జూన్ 21 🔹 ఎవరికి? – నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు 🔹 ఎలా? – హాల్‌టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం 🔹 ఏ బస్సుల్లో? – ఏసీ మినహా అన్ని టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో 🔹 హెల్ప్‌లైన్: 040-23450033, 68153333
154 వీక్షణలు

ట్యాగ్‌లు

#apsrtc #neet #ap

సంబంధిత వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

దళవాయి రమాదేవికి అభినందనలు తెలిపిన మంత్రి

నారా లోకేష్

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·