ముడి పొగాకుపై జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలి

కేంద్రానికి ఏపీ బృందం వినతి

న్యూఢిల్లీ, జూలై 21: ముడి పొగాకు (హెచ్‌ఎస్‌ఎన్ 2401)పై విధిస్తున్న జీఎస్టీని 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆంధ్రప్రదేశ్ బృందం కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఈ బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ బృందంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మతో పాటు రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ పెంపు వల్ల ఎఫ్‌సీవీ (ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా) పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బృందం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. తాము కోరుతున్న పన్ను తగ్గింపు ముడి పొగాకుకు మాత్రమే వర్తిస్తుందని, తుది ఉత్పత్తులకు కాదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలోని పొగాకు రైతులకు, ఎగుమతిదారులకు గణనీయమైన ఊరట లభిస్తుందని బృందం పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన పరిశీలన చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
213 వీక్షణలు

ట్యాగ్‌లు

#aptdp #delhi

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·