*కష్టమొచ్చిన వేళ...తొలి చిరునామా"సాంబన్న"క్యాంపు కార్యాలయం*

"సాంబన్న" సేవా దీక్ష పర్చూరు ప్రజలకు భరోసా

•ప్రజల చెంతకు పాలన..ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయం ఆదర్శం •అర్జీ నుంచి పరిష్కారం వరకు నిరంతర పర్యవేక్షణ.. •పేదలకు వైద్య, ఆహార సేవలు •24 గంటలూ అందుబాటులో సిబ్బంది.. •పారదర్శకంగా ప్రజా సమస్యల పరిష్కారం •80 వేలకుపైగా ఉచిత కంటి ఆపరేషన్లు.. • 20,107మందికి రూ.19 కోట్ల వైద్య సాయం •నేతలు,కార్యకర్తలకు ప్రత్యేక వైద్య క్యాప్ లు •వేల కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పర్చూరు: రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి..పోతుంటాయి.కానీ ప్రజల కష్టాల్లో తోడుగా నిలిచి, నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలకు పరిష్కారం చూపే నాయకులు మాత్రమే ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలుస్తారు. అలాంటి నాయకుడిగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గుర్తింపు పొందారు. ఆయన ప్రజాసేవకు కేంద్రబిందువుగా నిలుస్తున్న ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయం, నియోజకవర్గ ప్రజల సమస్యలు విని అధికార యంత్రాంగంతో సమన్వయం చేసే భరోసా కేంద్రంగా మారింది. రాజకీయ నాయకుల కార్యాలయాలంటే సాధారణంగా పైరవీలు, హడావుడి కనిపిస్తుంటాయి. కానీ ఏలూరి క్యాంపు కార్యాలయం మాత్రం అందుకు భిన్నంగా, నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజల సమస్యలు వినడం మొదలు, పరిష్కారమయ్యే వరకు అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం సిబ్బంది నిత్యకృత్యంగా మారింది. తొలి అడుగులోనే భరోసా.... సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కరినీ సిబ్బంది ఆప్యాయంగా పలకరిస్తూ, కూర్చోబెట్టి, మంచినీరు అందిస్తూ సమస్యను తెలుసుకుంటున్నారు. దీంతో పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో ప్రజలు కార్యాలయం నుంచి బయటకు వెళ్తున్నారు. వచ్చే ప్రతి అర్జీని కంప్యూటరీకరించి, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుల దృష్టికి, అక్కడి నుంచి సంబంధిత శాఖల అధికారులకు పంపించడం.. అనంతరం పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించడం నిరంతర ప్రక్రియగా సాగుతోంది. అర్జీ తీసుకుని పంపడంతోనే బాధ్యత ముగియదు. అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారమయ్యే వరకు అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ప్రత్యేక విభాగాలు.... కార్యాలయంలో పదిమందికిపైగా సిబ్బంది వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తూ, సమిష్టి కృషితో సమస్య పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కార్యాలయానికి వచ్చే ప్రజలు చెబుతున్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేని సమయాల్లోనూ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కష్టంలో తొలి ఫోన్‌.. క్యాంపు కార్యాలయానికే నియోజకవర్గంలో ఎవరైనా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనా, అర్ధరాత్రి వేళ అత్యవసర వైద్య సాయం అవసరమైనా క్యాంపు కార్యాలయ సిబ్బంది వెంటనే స్పందిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరాల్లోని ఆసుపత్రులతో సమన్వయం చేస్తూ బెడ్లు ఏర్పాటు చేయించడం, మెరుగైన వైద్యం అందేలా చూడటం చేస్తున్నారు. సాంబన్న నిరంతర పర్యవేక్షణ... ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF), ఎల్‌ఓసీ (LOC) ప్రక్రియను వేగవంతం చేసేందుకు ధ్రువపత్రాల సేకరణ నుంచి దరఖాస్తు, అధికారుల ఆమోదం, చెక్కు అందే వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజలకు అత్యవసర వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక విభాగం పనిచేస్తుంది. దరఖాస్తు మొదలు... సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చేవరకు ప్రతినిత్యం ఈ విభాగం పని చేస్తుంది. ఇప్పటివరకు 20,107 మంది పేద రోగులకు రూ.19 కోట్లకుపైగా వైద్య సాయం అందించారు. ఈ ప్రక్రియలో పర్చూరు నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో ముందంజలో ఉండటం కార్యాలయ పనితీరుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. ఆకలి తీర్చే ఆతిథ్యం... దూరప్రాంతాల నుంచి ఉదయాన్నే బస్సుల్లో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కార్యాలయంలో భోజన సదుపాయం (క్యాంటీన్‌) ఏర్పాటు చేశారు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు ఆహారం అందిస్తున్నారు. వచ్చిన వారిని కుటుంబ సభ్యుల మాదిరిగా పలకరిస్తూ, భోజనం చేసి వెళ్లాలని ఆహ్వానించడం ఇక్కడి ప్రత్యేకత. ఒక రాజకీయ కార్యాలయంలో రోజులో మూడు పూటలా ప్రజలకు ఆహార సౌకర్యం కల్పించడం అరుదైన విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.. 80 వేలకుపైగా కంటి ఆపరేషన్లు... ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్న ఎమ్మెల్యే సొంత నిధులతో ఆధునిక పరికరాలతో ఉచిత జిమ్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తండ్రి దివంగత ఏలూరి నాగేశ్వరరావు పేరుతో ఏర్పాటు చేసిన ఏలూరి చారిటబుల్ ట్రస్ట్‌ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు, కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. లక్ష మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించాలనే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 80 వేలకుపైగా పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు. నేతలకు వైద్యంలో మోడల్ నియోజకవర్గంగా.... ప్రతినిత్యం నెల నెల కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు దీనికి తోడు ప్రత్యేకంగా ప్రముఖ వైద్యశాలలతో ప్రత్యేక మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు నాయకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి వైద్యం అందేలా ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యేక చొరవ చూపుతూ రాష్ట్రానికి మోడల్గా నిలుస్తున్నారు.. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అత్యవసర ఆధునిక వైద్యం అందించడంలో ఎమ్మెల్యే కృషి అమోఘం. రూపాయి ఆశించని సేవ... ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఆశించకుండా, పారదర్శకంగా పనిచేయడం కార్యాలయ విధానం. వ్యక్తిగత ప్రాధాన్యాలకు తావులేకుండా ‘మేము’ అనే భావనతో సిబ్బంది సమిష్టిగా పనిచేస్తున్నారు. ప్రజా సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు, ప్రజాప్రతినిధుల పర్యటనల సందర్భాల్లోనూ ఏర్పాట్లను సమర్థంగా నిర్వహిస్తూ కార్యాలయ సిబ్బంది ప్రశంసలు అందుకుంటున్నారు. “జనసేవే.. సాంబన్న సేవ” అనే మాటను నినాదంగా కాకుండా ఆచరణలో చూపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. పర్చూరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా, తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన తెలుగుదేశం పార్టీకి, పర్చూరు ప్రజలకు సేవల ద్వారా రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పనిచేస్తున్నారని ఆయన అభిమానులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఇక అభివృద్ధిలో రాష్ట్రానికే రోల్ మోడల్ గా పర్చూరు నియోజకవర్గం నిలుస్తుంది వేలకోట్ల అభివృద్ధితో శాఖల సమన్వయంతో అభివృద్ధి ప్రగతి పదంలో దూసుకెళ్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం.. వైద్య సహాయం.. ఆహార సేవ.. ఆరోగ్య పరిరక్షణ.. సంక్షేమ పథకాల అమలు.. నిరంతర ప్రజా సంప్రదింపులు.. ఇలా అనేక కార్యక్రమాలకు వేదికగా మారిన ఏలూరి క్యాంపు కార్యాలయం పర్చూరు ప్రజలకు ఒక భరోసా కేంద్రంగా నిలుస్తోంది.
485 వీక్షణలు

ట్యాగ్‌లు

#mlayeluri #campoffice

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·