చేనేతకు పూర్వ వైభవం తెస్తాం

సీఎం చంద్రబాబు

‘నేతన్న సేవలో’కు శ్రీకారం.. 71,536 కుటుంబాలకు రూ.179 కోట్లు చీరాలను ‘మినీ ముంబై’గా తీర్చిదిద్దుతాం: వేటపాలెం,ఆగస్టు 7: చేనేత కేవలం ఒక వృత్తి కాదని.. భారతీయ సంస్కృతికి, దేశం గర్వించే కళకు ప్రతీక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కష్టాల్లో ఉన్న చేనేత రంగానికి అండగా నిలిచి నేతన్నల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ‘నేతన్న సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 71,536 చేనేత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున రూ.179 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రకటించారు. చీరాలకు పూర్వ వైభవం చీరాల పేరు వినగానే నేతన్నల నైపుణ్యం గుర్తుకొస్తుందని చంద్రబాబు అన్నారు. చీరాల పట్టు, కాటన్‌ చీరలకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. చీరాల ఖర్చీఫ్‌లు ఒకప్పుడు విదేశాలకు భారీగా ఎగుమతి అయ్యేవని గుర్తుచేశారు. చేనేత ఉత్పత్తుల్లో ఒకప్పుడు ‘మినీ ముంబై’గా పేరొందిన చీరాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. చీరాలతో పాటు వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, శ్రీకాళహస్తి, నరసాపురం తదితర ప్రాంతాల చేనేత ఉత్పత్తులకు విశిష్ట గుర్తింపు ఉందన్నారు. 1.27 లక్షల కుటుంబాలకు ఆసరా రాష్ట్రంలో సుమారు 1.27 లక్షల మంది చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని సీఎం తెలిపారు. సంప్రదాయం, సృజనాత్మకత కలగలిసిన అపూర్వ నైపుణ్యం నేతన్నల్లో ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నామనడానికి ‘నేతన్న సేవలో’ పథకమే నిదర్శనమన్నారు. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్‌ యూనిట్లకు ప్రయోజనం కలుగుతోందన్నారు. 50 ఏళ్లకే ఎన్టీఆర్‌ భరోసా పింఛను అందిస్తున్నామని, 85 వేల మంది చేనేతలకు నెలకు రూ.4 వేల చొప్పున పింఛనుగా రూ.35 కోట్లు, ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. క్లస్టర్ల అభివృద్ధి రాష్ట్రంలోని 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్‌ క్రెడిట్‌ ద్వారా రూ.79 కోట్లు అందించామని సీఎం తెలిపారు. స్మాల్‌ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద రూ.10 కోట్ల వ్యయంతో 10 చేనేత క్లస్టర్లకు ఆమోదం పొందినట్లు చెప్పారు. హ్యాండ్లూమ్‌ మార్కెటింగ్‌ అసిస్టెన్స్‌ కార్యక్రమంతో నేత కార్మికులకు నేరుగా మార్కెట్‌ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక వసతుల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ రానుందని తెలిపారు. బీసీలకు అండగా కూటమి ప్రభుత్వం వెనుకబడిన బీసీ వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. చేపల వేట నిషేధ సమయంలో 1.34 లక్షల మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున రూ.505 కోట్లు అందించామని తెలిపారు. వడ్డెరలకు మైనింగ్‌ లీజులు, గీత కార్మికులకు ఎక్సైజ్‌ దుకాణాలు కేటాయించామన్నారు. బీసీలకు సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటులో 3 కిలోవాట్లకు అదనంగా రూ.20 వేల సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. బీసీల రక్షణ చట్టం కోసం ముసాయిదా సిద్ధమైందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల చొప్పున యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకువస్తున్నామని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం అభివృద్ధితో పాటు సంక్షేమం, సుపరిపాలన అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. పేదలు భోజనానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూ.5కే అన్నా క్యాంటీన్లలో భోజనం అందిస్తున్నామని చెప్పారు. విద్య అందరికీ అందాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉన్నా వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. గత పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని, ఇప్పుడు వాటికి మరమ్మతులు చేపట్టామని చెప్పారు. పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించామని, ఇప్పటికే రూ.12 లక్షల కోట్ల మేర పెట్టుబడులు గ్రౌండ్‌ అయ్యాయని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించేలా పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాల నిర్మాణంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. సూర్యలంక–చీరాల పర్యాటక కారిడార్‌ బాపట్ల, చీరాల సముద్రతీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా సూర్యలంక, బాపట్ల, చీరాల తీర ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నామన్నారు. రూ.97 కోట్ల స్వదేశ్‌ దర్శన్‌ నిధులతో సూర్యలంక నుంచి చీరాల వరకు పర్యాటక కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ఎం ఎం కొండయ్య ,పాల్గొన్నారు.
188 వీక్షణలు

ట్యాగ్‌లు

#national #handloom #day

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·