సాగునీటిపై సమగ్ర ప్రణాళిక ప్రకటించాలి

మాజీ మంత్రి పువ్వాడ

రైతులకు ముందుగానే నీటి లభ్యతపై స్పష్టత ఇవ్వాలి ఖమ్మం, ఆగస్టు 8: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాగునీటి లభ్యత, వినియోగం, నీటి విడుదలపై రైతులకు ప్రభుత్వం స్పష్టమైన అవగాహన కల్పించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కోరారు. ఎల్‌నినో ప్రభావం, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగుకు అవసరమైన నీటి లభ్యతపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని సూచించారు. రైతులు పంటల ఎంపిక, సాగు సమయం తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకునేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాగర్‌, గోదావరి, మున్నేరు, వైరా, పాలేరు, కిన్నెరసాని తదితర జల వనరుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, నీటి విడుదల సమయం, ఏ ప్రాంతానికి ఎంత నీరు అందుబాటులో ఉంటుందనే వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాలని కోరారు. నీటి విడుదలకు సంబంధించి ముందస్తు షెడ్యూల్‌ ప్రకటిస్తే రైతులు సాగును ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.వర్షపాతంలో హెచ్చుతగ్గులు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని కోరారు.
176 వీక్షణలు

ట్యాగ్‌లు

#puvvada #tg #brs

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·