అమెరికాలో వరదల్లో కొట్టుకుపోయిన పర్చూరు యువకుడు

, రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే ఏలూరి లేఖలు

పర్చూరు: అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వరదల్లో పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన యువకుడు తప్పిపోయిన ఘటనపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు లేఖలు రాశారు. దేవరపల్లికి చెందిన దొప్పలపూడి రాంబాబు కుమారుడు వెంకటేష్ ప్రస్తుతం అమెరికాలోని ఒమాహా నగరంలో నివాసం ఉంటున్నారు. కాన్సాస్‌లోని వెల్లింగ్టన్ సమీపంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎస్. ఆలివర్ రోడ్‌లోని 600వ బ్లాక్ ప్రాంతంలో ఆయన కొట్టుకుపోయినట్లు ఎమ్మెల్యే ఏలూరి లేఖల్లో పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో వెంకటేష్ ప్రయాణిస్తున్న కారు, కారులో ఉన్న బ్యాగు లభ్యమైనప్పటికీ, అతని సెల్ ఫోన్ ఆచూకీ ఇంతవరకు లభించలేదని ఎమ్మెల్యే తన లేఖల్లో పేర్కొన్నారు. ఈ విషయంపై తక్షణమే గాలింపు చర్యలు చేపట్టాలని, అమెరికా రాయబార కార్యాలయానికి విషయాన్ని తెలియజేయాలని ఎమ్మెల్యే ఏలూరి మూడు వేర్వేరు లేఖల ద్వారా ఆయా మంత్రులను కోరారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు రాసిన లేఖలో, తప్పిపోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టేలా అమెరికా రాయబార కార్యాలయానికి విషయాన్ని పంపించాలని కోరారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్‌కు రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ విషయాన్ని కేంద్రం, అమెరికా రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు రాసిన లేఖలో కూడా ఇదే అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు లేఖల్లోనూ ఎమ్మెల్యే, వెల్లింగ్టన్‌లో సంభవించిన భారీ వరదల్లో దేవరపల్లి యువకుడు కొట్టుకుపోయినట్లు పేర్కొంటూ, బాధితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, వివరాలను రాష్ట్రానికి తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని స్థానిక కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే ఏలూరి సహాయ చర్యలు చేపట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు.
871 వీక్షణలు

ట్యాగ్‌లు

#mla #yeluri #parchur

సంబంధిత వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

దళవాయి రమాదేవికి అభినందనలు తెలిపిన మంత్రి

నారా లోకేష్

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·