పశ్చిమ బెంగాల్ సీఎంతో
మంత్రి లోకేష్ భేటీ
1 / 2
కోల్‌కతా,జూన్ 18: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి చేనేత శాలువాతో సీఎంను సత్కరించిన లోకేష్, ఏపీలో అమలవుతున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, డిజిటల్ గవర్నెన్స్, సంక్షేమ పథకాల అమలు విధానాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్–పశ్చిమ బెంగాల్ మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని కోరారు. పశ్చిమ బెంగాల్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, తిరుమలలో పశ్చిమ బెంగాల్ భవన్ నిర్మాణానికి సహకారం అందిస్తామని తెలిపారు. మంత్రి ప్రతిపాదనలపై పశ్చిమ బెంగాల్ సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.