దక్షిణ కొరియా పర్యటనకు మంత్రి లోకేష్‌

ఈనెల 5 నుంచి 11 వరకు

అమరావతి: భారత్‌-దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా ఆహ్వానం మేరకు ఈనెల 5 నుంచి 11వ తేదీ వరకు ఆరు రోజులపాటు ఆయన ఈ పర్యటన చేపడుతున్నారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతోనే ఈ అధికారిక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇరుదేశాల సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన కీలక అడుగు కాగలదని దక్షిణ కొరియా కాన్సులేట్‌ జనరల్‌ (చెన్నై) చాంగ్‌ న్యూన్‌ కిమ్‌ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రోజువారీగా షెడ్యూల్‌ ఈనెల 5న సియోల్‌లో జరిగే ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశంలో పాల్గొని అక్కడి భారతీయులు, తెలుగువారిని ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు. 6న టెక్‌ స్టార్టప్‌ సంస్థల ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంతోపాటు పెట్టుబడి చర్చల్లో పాల్గొంటారు. అనంతరం హ్యోసంగ్‌ భారీ పరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్‌ సెమికండక్టర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టేహ్యుంగ్‌ లీతో సమావేశమవుతారు. 7న ఎల్జీ కెమ్‌ గ్లోబల్‌ స్ట్రాటజీ సెంటర్‌ ప్రెసిడెంట్‌ యున్‌ జు కోహ్‌ ఏర్పాటు చేసిన విందు సమావేశంలో పాల్గొంటారు. దీనికి ఎల్జీ అనుబంధ సంస్థల ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలు హాజరుకానున్నాయి. 8న కొరియన్‌ మెరైన్‌ ఎక్విప్‌మెంట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ భేటీలో పాల్గొంటారు. 9న కొరియన్‌ పొలిటికల్‌ ఎఫైర్స్‌ డిప్యూటీ మినిస్టర్‌ యుయి-హే సిసిలియా చుంగ్‌, అనంతరం ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ డిప్యూటీ మినిస్టర్‌ కాంచన్‌ కాంగ్‌తో వేర్వేరుగా సమావేశమవుతారు. 10న వివిధ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడి చర్చలు, కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్‌ ఏజెన్సీ ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. అదేరోజు రాత్రి సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌-2026ను విజయవంతం చేయాలని కోరుతూ కొరియా కంపెనీల ప్రతినిధులతో రోడ్‌షోలో పాల్గొంటారు.
157 వీక్షణలు

ట్యాగ్‌లు

#nara #lokesh #koriya

సంబంధిత వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

దళవాయి రమాదేవికి అభినందనలు తెలిపిన మంత్రి

నారా లోకేష్

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·