ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల భేటీ
1 / 2
అమరావతి,జూన్ 4:ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.ఈ భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.