జలధార పనులకు వేగం.. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం

సీఎం చంద్రబాబు

అమరావతి:రాష్ట్రంలో చేపట్టిన జలధార-జలహారతి కార్యక్రమాల్లో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జలధార-జలహారతి పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా పనులు చేపట్టాలని, నిధుల వినియోగంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్లకు సూచించారు. నీటి మిగులు బేసిన్ల నుంచి తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాలకు అనుసంధాన పనులు చేపట్టాలని ఆదేశించారు. చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, ఫామ్‌పాండ్‌లు, కాంటూర్ కందకాల పునరుద్ధరణలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న వాగుల అభివృద్ధికి చిత్తూరు జిల్లా వాల్మీకిపురం వాగు అభివృద్ధి నమూనాను పరిశీలించాలని సూచించారు. వర్షపు నీటిని వడిసిపట్టేలా జిల్లాల వారీగా వినూత్న చర్యలు అమలు చేయాలని చెప్పారు. జలధార తొలి విడత పనులు పూర్తయ్యాక చెక్‌డ్యామ్‌లు, ఫామ్‌పాండ్‌లు, చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీటి ప్రవాహాలకు ఆటంకం లేకుండా కాలువలు, కరకట్టల్లోని అడ్డంకులను తొలగించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మరింత పెంచాలని సీఎం ఆదేశించారు. జలధార కార్యక్రమం వల్ల కలిగే ప్రయోజనాలను ఇరిగేషన్, అవేర్ తదితర సంస్థల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు. జిల్లాల వారీగా భూగర్భ జలాల పునరుద్ధరణపై సమగ్ర లెక్కలు సిద్ధం చేయాలని చెప్పారు. జలధార కార్యక్రమంలో స్థానికులు, రైతులు, నీటి వినియోగదారుల సంఘాలను భాగస్వాములు చేయాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం సూచించారు. సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
146 వీక్షణలు

ట్యాగ్‌లు

#cm #apcmcbn #jaladhara #confrance

సంబంధిత వార్తలు

రాజకీయాలు

ఎమ్మెల్యే కృషికి ఫలితం పశువైద్యశాలలకు సొంత భవనాలు

రూ.1.25 కోట్లు మంజూరు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ముడి పొగాకుపై జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలి

కేంద్రానికి ఏపీ బృందం వినతి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్షేత్రస్థాయి వాస్తవాలతోనే ఎల్‌నినోను ఎదుర్కోవాలి

డిప్యూటీ సీఎం భట్టి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

నీటి లభ్యతను బట్టే పంటల ఎంపిక ఉండాలి

మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

దేవాలయాల దొంగతనాల ముఠా గుట్టురట్టు..

ముగ్గురు అరెస్టు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ప్రజల మదిలో సాంబన్నగా..హ్యాట్రిక్ నేతగా ఏలూరి

సేవ,అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

ఎమ్మెల్యే కృషికి ఫలితం పశువైద్యశాలలకు సొంత భవనాలు

రూ.1.25 కోట్లు మంజూరు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ముడి పొగాకుపై జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలి

కేంద్రానికి ఏపీ బృందం వినతి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్షేత్రస్థాయి వాస్తవాలతోనే ఎల్‌నినోను ఎదుర్కోవాలి

డిప్యూటీ సీఎం భట్టి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

నీటి లభ్యతను బట్టే పంటల ఎంపిక ఉండాలి

మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

దేవాలయాల దొంగతనాల ముఠా గుట్టురట్టు..

ముగ్గురు అరెస్టు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ప్రజల మదిలో సాంబన్నగా..హ్యాట్రిక్ నేతగా ఏలూరి

సేవ,అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

విశ్వవిజేతగా స్పెయిన్..రెండోసారి ప్రపంచకప్ కైవసం

అర్జెంటీనాపై విజయం

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

చంద్రుడిపై మానవుడి తొలి అడుగుకు 57 ఏళ్లు

సరిగ్గా ఇదే రోజు..

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విశ్వనగరిగా అమరావతి ఎదగాలని జగన్నాథుడిని వేడుకున్న సీఎం

చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

తెలంగాణ సహకార రంగంపై ఇరాన్‌ ప్రతినిధి బృందానికి వివరించిన

మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·